తెలంగాణ
Kavitha: మేడ్చల్‌లో కవిత పర్యటన

Kavitha: జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా రామంతపూర్ ఇందిరా నగర్‌లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కవిత.
అనంతరం ఇందిరా నగర్ చెరువును పరిశీలించారు కవిత. చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని చెరువు భూములు కబ్జాకు గురయ్యాయని స్థానిక ప్రజలు కవిత దృష్టి తీసుకొచ్చారు.



