తెలంగాణ
Kavitha: హరీశ్ రావు ఇంటికి వెళ్లి పరామర్శించిన కవిత

Kavitha: కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును పరామర్శించారు. హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు రెండు రోజుల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత హరీశ్ నివాసానికి వెళ్లి ఆయనను, కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యనారాయణరావు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన కవిత, కుటుంబ సభ్యులను ఓదార్చారు. సత్యనారాయణరావు సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.



