తెలంగాణ
Kavitha : ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చా

Kavitha : ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చా ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్ చిట్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు పెట్టారని కవిత తెలిపారు. నాకు అండగా నిలిచి వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చానన్నారు. తనకు తల్లిదండ్రులు, అత్తామామలు అండగా నిలిచారన్నారు. సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ చేశారన్నారు. నన్ను మూడేళ్ల పాటు నానా మాటలన్నారని కవిత అన్నారు. న్యాయవ్యవస్థ పైన తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు.



