యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా 58వ గ్రంథాలయ వారోత్సవాలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో 58వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు జాతీయ జెండాను ఆవిష్కరించి నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ అవైస్ రెహ్మాన్ చిష్టి అదనపు కలెక్టర్ భాస్కరరావును సన్మానించి జ్ఞాపికను అందజేశారు వీరంతా గ్రంథాలయ ఆవశ్యకతను తెలియచేస్తూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో తమకు లైబ్రరీ ఎంతో ఉపయోగపడిందన్నారు జిల్లా అదనపు కలెక్టర్. ఏ విషయాన్ని తెలుసుకోవాలన్న పుస్తక పఠనం ద్వారానే తెలుస్తుందన్నారు. బడుగు బలహీన వర్గాలు, ఉన్నత వర్గాలు ఎవరైనా ఉద్యోగాలు సంపాదించాలన్న లైబ్రరీ పుస్తకాల ద్వారానే అది సాధ్యమవుతుందన్నారు జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్. ప్రతి ఏడాది గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు లైబ్రరీల వల్ల కలిగే ప్రయోజనాలను వివారిస్తున్నామని తెలిపారు.



