Kavitha: నేటి నుంచి కవిత జాగృతి జనం బాట

Kavitha: జాగృతి జనం బాట కార్యక్రమంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నేటి నుంచి జిల్లాల యాత్ర చేపట్టనున్నారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా 33జిల్లాల్లో యాత్రకు రూట్ మ్యాప్ రెడీ చేసుకున్న కవిత నిజామాబాద్ నుంచి జనం బాటకు శ్రీకారం చుట్టనున్నారు. గన్ పార్క్‌లో అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్న కవిత హైదరాబాద్ నుంచి నిజామాబాద్ చేరుకుంటారు. ఫిబ్రవరి వరకు అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ కవిత జనం బాట పూర్తిచేయనున్నారు.
కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేయాలని కవిత నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ప్రజల్లోకి వెళ్లనున్న కవిత..యాత్రలో భాగంగా మేథావులు, విద్యావంతులను కలుసుకోనున్నారు. రాజకీయంగా ఎలా ముందడుగు వేయాలనే అంశాలపై బడుగు బలహీనవర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడుతానన్న కవిత జిల్లాల యాత్ర పూర్తి అయ్యేలోపు కవిత క్లారిటీ ఇవ్వనున్నారు.



