Karmanye Vadhikaraste: ఆకట్టుకుంటున్న “కర్మణ్యే వాధికారస్తే” టీజర్

Karmanye Vadhikaraste: అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వంలో, ఉషస్విని ఫిలిమ్స్ బ్యానర్‌పై డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించిన ఈ ‘కర్మణ్యే వాధికారస్తే’ చిత్రంలో.. శత్రు, బ్రహ్మాజీ, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించగా, పృథ్వీ, శివాజీ రాజా, శ్రీ సుధా, బెనర్జీ, అజయ్ రత్నం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఐరా దయానంద్ రెడ్డి ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, భాస్కర్ సామల సినిమాటోగ్రఫీ, గ్యానీ సంగీతం ఈ చిత్రానికి బలమైన అంశాలు.
శివకుమార్ పెళ్లూరు కథ, సంభాషణలు అందించారు. విశాఖపట్నం, హైదరాబాద్‌లో షూటింగ్ జరిపిన ఈ మూవీ ప్రస్తుతం ప్రసాద్ ఫిలిం ల్యాబ్, సారధి స్టూడియోస్‌లో పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. తాజాగా విడుదలైన టీజర్ ఉత్కంఠభరితంగా నిలిచి సినిమాపై అంచనాలు పెంచింది. త్వరలో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది.