సినిమా
Kareena Kapoor: ఫ్యామిలీ అంతా సేఫ్‌గా ఉన్నారు.. దాడి ఘటనపై కరీనా టీమ్ స్పందన

Kareena Kapoor: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో నటుడి ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్‌కు చికిత్స అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో దాడి ఘటనపై సైఫ్ భార్య, బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ టీమ్ స్పందించింది.‘నిన్న రాత్రి సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ నివాసంలో చోరీకి యత్నం జరిగింది. ఓ దుండగుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ చేతికి గాయం అయ్యింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబంలోని మిగిలినవారు అంతా సేఫ్‌గానే ఉన్నారు’ అని పేర్కొంది. ఈ మేరకు స్టేట్‌మెంట్ విడుదల చేసింది.