కాంతార వసూళ్ల జోరు!

Kantara Chapter 1 : రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం, నాలుగో రోజు కూడా దూసుకెళ్లింది. ఈ సంచలనం ఎక్కడి వరకు వెళుతుంది? పూర్తి వివరాలు చూద్దాం.
కాంతార చాప్టర్ 1 రిషబ్ శెట్టి దర్శకత్వం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ డివోషనల్ యాక్షన్ డ్రామా, పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించింది. మూడు రోజుల్లో 230 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి, నాలుగో రోజు 60 కోట్లు దాటి 300 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టింది.
రిషబ్ శెట్టి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, సినిమా విజువల్స్, భక్తి భావం అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ విజయం రిషబ్ బ్రాండ్‌ను జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. కాంతార సీక్వెల్‌పై ఇప్పటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. సోషల్ మీడియాలో కాంతార ఫీవర్ జోరుగా సాగుతోంది.



