విష్ణు కెరీర్‌లో అద్భుతమైన రికార్డు?

Manchu Vishnu: మంచు విష్ణు హీరోగా, ప్రీతీ ముకుందన్ హీరోయిన్‌గా నటించిన ‘కన్నప్ప’ చిత్రం బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డివోషనల్ డ్రామా, భక్తి రసంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా రన్ అవుతోంది.
మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. శివభక్తుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, భక్తి, భావోద్వేగాల సమ్మేళనంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. విష్ణు నటన, క్లైమాక్స్‌లోని భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల కంటతడి పెట్టిస్తున్నాయి.
ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్లు కీలక పాత్రల్లో మెరిసారు. మోహన్ బాబు నటన, నిర్మాణం రెండూ సినిమాకు బలం. న్యూజిలాండ్‌లో చిత్రీకరణ, స్టీఫెన్ దేవస్సీ సంగీతం, షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ చిత్రానికి గ్రాండ్ లుక్‌ను అందించాయి. ఆన్‌లైన్ బుకింగ్స్‌లో హాఫ్ మిలియన్ టికెట్లు అమ్ముడై, విష్ణు కెరీర్‌లో రికార్డు సృష్టించింది.