Kannappa: కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Kannappa: పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ “కన్నప్ప” గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఈ భారీ చిత్రం రిలీజ్ డేట్‌పై క్లారిటీ రాగా, ఫ్యాన్స్‌లో ఉత్సాహం డబుల్ అయిపోయింది. వివరాల్లోకి వెళ్తే..
మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న “కన్నప్ప” సినిమా ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సి ఉండగా, మేకర్స్ దీన్ని వాయిదా వేశారు. తాజాగా ఈ భారీ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఈ విషయం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మోహన్ బాబు, మంచు విష్ణు కలిసిన సందర్భంగా బయటకు వచ్చింది.
ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో, మోహన్ బాబు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ వంటి దిగ్గజ తారలు నటిస్తున్నారు. ఇటీవల యోగి ఆదిత్యనాథ్‌తో జరిగిన సమావేశం తర్వాత కొత్త రిలీజ్ డేట్ ప్రకటన వచ్చింది. దీంతో జూన్ 27 నుంచి “కన్నప్ప” థియేటర్లలో రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.