జాతియం
Kamal Haasan: రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కమల్‌హాసన్

Kamal Haasan: రాజ్యసభ సభ్యుడిగా కమల్‌హాసన్ ప్రమాణం చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌రాయ్ ఎమ్ఎన్‌ఎమ్ అధినేత కమల్‌తో ప్రమాణం చేయించారు. తమిళనాడులో పొత్తులో భాగంగా కమల్‌కు డీఎంకే పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది.
కమల్ MNM పార్టీ, సీఎం స్టాలిన్ డీఎంకే పార్టీ మధ్య అవగాహన ఉండటంతో గత ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేశాయి. గతంలో కుదిరిన అవగాహన ప్రకారం తమిళనాడు నుంచి కమల్ హాసన్‌కు పెద్దల సభ సీటిచ్చి స్టాలిన్ గౌరవించారు.