సినిమా

Kalki 3D Promo: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కల్కి 3D ప్రోమో!

Kalki 3D Promo: కల్కి 2898 AD మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కిన ఈ గ్రాండ్ విజువల్ వండర్, విడుదలైనప్పటి నుండి ఎన్నో రికార్డులను తిరగరాసింది. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం 1100 కోట్ల భారీ వసూళ్లను సాధించడంతో పాటు ఓటీటీలోనూ ట్రెండింగ్‌గా నిలిచింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోణె, దిశా పటానీ, షోభన కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

కల్కి రెండో పార్ట్‌పై కూడా ఎక్కువ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరింత పెంచుతూ టీమ్ గ్రాండ్ టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ నెల 23న కల్కి 2898 AD జీ తమిళ్‌లో సాయంత్రం 3 గంటలకు ప్రసారం కానుంది. టెలివిజన్ ప్రేక్షకులకు అద్భుత అనుభూతిని అందించనుంది.

మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వర్చువల్ 3D ప్రోమోని విడుదల చేశారు. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ లేటెస్ట్ 3D ప్రోమో విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అందులో సినిమాలోని అద్భుతమైన సన్నివేశాలను కొత్తగా 3D టెక్నాలజీతో ప్రెజెంట్ చేశారు. విజువల్ ట్రీట్‌గా మారిన ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button