Kalki 2: కల్కి -2 షూటింగ్ స్టార్ట్?

Kalki 2: ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ కల్కి 2 షూటింగ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వచ్చింది.
కల్కి తొలి భాగం షూటింగ్ చేస్తోన్న సమయంలో రెండవ భాగానికి సంబంధించి 30 శాతం షూటింగ్ పూర్తయిందని ప్రకటించారు.అయితే తాజాగా మిగిలిన 70 శాతం షూటింగ్ కి సంబంధించి నాగీ ప్రణాళిక సిద్దం చేసారు. మే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుందని సమాచారం.తొలి షెడ్యూల్లో అమితాబచ్చన్ పాల్గొంటారు. అటుపై జూన్ లో రెండవ షెడ్యూల్ మొదలవుతుందట.
ఇందులో చాలా మేజర్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారట. ఇందులో ప్రభాస్-కమల్ హాసన్ పై కీలక పోరాట ఘట్టాలు చిత్రీకరించనున్నారట. రెండవ భాగంలో ప్రభాస్ పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం. సినిమాలో చాలా సన్నివేశాలు చాలా యూనిక్ గా ఉండబోతున్నాయట. ఇంత వరకూ ఇండియాన్ స్క్రీన్ పై చూడని ఎన్నో సన్నివేశాలుంటాయంటున్నారు. అలాగే కథ ఎమోషనల్ గానూ కనెక్ట్ అవుతుందట. ప్రభాస్ పాత్ర రెండవ భాగంలో అభిమానుల ఊహని మించి ఉంటుందని తెలుస్తుంది.