తెలంగాణ
Kaleshwaram: పుణ్యస్నానాలతో కిటకిటలాడుతున్న త్రివేణి సంగమం

Kaleshwaram: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల పుణ్యస్నానాలతో త్రివేణి సంగమం కిటకిటలాడుతోంది. పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పొటెత్తారు. పుష్కరాలల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.