Kajol: సినిమాలు తగ్గినా… కాజోల్ ఖాతాలో కోట్లు!

Kajol: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ప్రస్తుతం సినిమాలు దాదాపు చేయటం లేదు. అయినప్పటికీ ఆమె ఆదాయం ఆగడం లేదు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో నెలనెలా లక్షలు వస్తున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజోల్ ఇప్పుడు సినిమాల సంఖ్య బాగా తగ్గించేశారు. కానీ ఆమె బ్యాంకు బ్యాలెన్స్ మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. దీని వెనుక రహస్యం రియల్ ఎస్టేట్ పెట్టుబడులు. ముంబైలోని బ్యాంక్ స్ట్రీట్ పక్కన ఆమెకు ఉన్న భారీ కమర్షియల్ భవనాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు లీజుకిచ్చారు. తద్వారా వచ్చే తొమ్మిదేళ్లలో రూ.8.6 కోట్ల రెంట్ వస్తుంది. అంటే నెలకు సుమారు రూ.6.9 లక్షలు స్థిరంగా ఖాతాలో జమ అవుతున్నాయి.
ఈ భవనంతో పాటు మరికొన్ని కమర్షియల్, రెసిడెన్షియల్ ఆస్తులు కూడా ఆమె పేరిట ఉన్నాయి. వాటి నుంచి ప్రతి ఏటా కోట్లలో ఆదాయం వస్తోందని సమాచారం. గతంలో సినిమాలతో కష్టపడి సంపాదించిన డబ్బును ఇప్పుడు తెలివిగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టి, ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ కోట్లు కొల్లగొడుతున్నారు కాజోల్. అందుకే ఆమెను ఇప్పుడు రియల్ ఎస్టేట్ క్వీన్‌గా పిలుస్తున్నారు.



