తెలంగాణ
ముగిసిన కడియం శ్రీహరి అనర్హత పిటిషన్

ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ ముగిసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ గంటన్నర సేపు విచారించారు. కడియంపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల ఫిబ్రవరి 1న వివేకానంద స్పీకర్ ను కలిసి ఆధారాలు ఇచ్చారు. ఎమ్మెల్యే వివేకానంద అడ్వొకేట్లను ఎమ్యెల్యే కడియం శ్రీహరి అడ్వొకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. నిన్న దానంపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ విచారించారు. రెండు పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ తీర్పు ఇవ్వనున్నారు.



