ఆంధ్ర ప్రదేశ్
Kadapa: గండికోట ఉత్సవాలు.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

కడప జిల్లా జమ్మలమడుగులో రేపటి నుంచి గండికోట ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలోనే గండికోట ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఎస్పీతో కలిసి పరిశీలించారు. ప్రపంచ ప్రఖ్యాతమైన గండికోటలో రేపటి నుంచి మూడు రోజుల పాటు అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
అనేక చారిత్రాత్మక ఘట్టాలకు నిలయమైన గండికోటలో కడప సంస్కృతి ఉట్టిపడే విధంగా ఉత్సవాలు జరగనున్నట్లు చెప్పారు. గండికోట ఉత్సవాలకు ప్రముఖ సింగర్ మంగ్లీ, డ్రమ్స్ కళాకారుడు శివమణి రానున్నట్లు వెల్లడించారు.



