తెలంగాణ
Jubilee Hills By Elections:జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల..

Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. వచ్చే నెల 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. 16న ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.



