సినిమా

JR NTR: జపాన్‌లో ‘దేవర’.. ఆయుధ పూజ పాటకు ఎన్టీఆర్ డ్యాన్స్

JR NTR: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘దేవర’ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో నటించగా, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో కనిపించారు. కొరటాల శివ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు.

జపాన్‌లో ‘దేవర’ సినిమా ప్రమోషన్స్‌ చాలా జోరుగా జరుగుతున్నాయి. ఇండియాలో భారీ విజయం సాధించిన ఈ సినిమాని ఇప్పుడు జపాన్‌లో కూడా అదే ఉత్సాహాన్ని కొనసాగించేందుకు టీమ్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ‘ఆయుధపూజ’ సాంగ్‌కు స్టెప్పులు వేసి థియేటర్‌ను హోరెత్తించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటకు ఎన్టీఆర్ ఒక అభిమానితో కలిసి డాన్స్ చేయగా, అక్కడి ప్రేక్షకులు ఉత్సాహంగా సీట్ల నుండి లేచి మరీ ఆనందించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ఎనర్జీని జపాన్ అభిమానులు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు.ఈ చిత్రం మార్చి 28న జపాన్‌లో విడుదల కానుంది. మరి అక్కడ ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button