తెలంగాణ
Vemulawada: వింత ఆచారం.. శివుడితో జోగినిల వివాహం

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లాలో హరిహర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జోగినిలు హంగామా చేసారు. శ్రీరామనవమి రోజున వేములవాడకు దాదాపు లక్షకుపైగా శివపార్వతులు, జోగిని లు, హిజ్రాలు, భక్తులు వచ్చి శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతున్న సమయంలో తాము కూడా శివుడిని పెళ్ళాడుతున్నట్లు ఒకరిపై ఒకరు అక్షింతలు చల్లుకున్నారు.
అలాగే ఒకరి తలపై ఒకరు జిలకర బెల్లం పెట్టుకుని, ఒకరి మెడలో ఒకరు తాళి కట్టుకొని శివుడిని పెళ్లాడారు. దేశంలో ఎక్కడా లేని వింత ఆచారం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున వేములవాడలో ఈ విధంగా చేస్తామని తెలిపారు. తమ జీవితం శివునికి అర్పిస్తూ, తనతోనే వారి జీవితం అంటూ, మిగతా సమయంలో రాజన్న ప్రచారం చేస్తామని చెప్పారు.