ఆంధ్ర ప్రదేశ్
Jogi Ramesh: కూటమి సర్కారుపై ప్రజలు విరక్తిచెందారు

Jogi Ramesh: కూటమి ప్రభుత్వంపై ప్రజలు విరక్తిచెందారని మాజీమంత్రి జోగి రమేష్ అన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టకపోవడంతో అనేకమంది ప్రాణాలు పోతున్నాయన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా వైసీపీ సిద్ధమని అన్నారు. వైసీపీ శ్రేణులను ఇబ్బందిపెట్టే వారి పేర్లను డిజిటల్ బుక్ లో నమోదు చేస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరిని వదిలిపెట్టబోమన్నారు. గ్రామగ్రామాన పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలంటూ దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు.



