సినిమా

Baahubali: బాహుబలి రీ-రిలీస్.. భారీ ట్రీట్ సిద్ధం!

Baahubali: బాహుబలి సినిమా మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. పదేళ్ల సందర్భంగా రాజమౌళి, ప్రభాస్ ల ఈ ఎపిక్ చిత్రం రెండు భాగాలను కలిపి అక్టోబర్ 31న రీ-రిలీస్ కానుంది.

తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిన బాహుబలి మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ ఎపిక్ చిత్రం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ-రిలీస్‌కు సిద్ధమవుతోంది.

బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2లను కలిపి ‘బాహుబలి – ది ఎపిక్’గా అక్టోబర్ 31న విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా రన్‌టైమ్ ఏకంగా 5 గంటల 20 నిమిషాలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలో గేమ్ ఛేంజర్‌గా నిలిచిన ఈ చిత్రం మళ్లీ ప్రేక్షకులకు భారీ వినోదాన్ని అందించనుంది. ఈ రీ-రిలీస్‌లో ఎలాంటి ఆశ్చర్యాలు ఉన్నాయో తెలియాలంటే వేచి చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button