ఆంధ్ర ప్రదేశ్
JC Prabhakar Reddy: మాజీ సీఎం జగన్‌పై ఫైర్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వలేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను జేసీ ప్రభాకర్ రెడ్డి ఖండించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి టీడీపీ నాయకులను ఇబ్బంది పెట్టారన్నారు. పెద్దారెడ్డి విషయంలో ఎంత దూరమైనా వెళ్తానని, తనతో ఫ్యాక్షన్ చేస్తానని సవాల్ విసిరిన వ్యక్తిని తాడిపత్రిలోకి రానిచ్చే ప్రసక్తే లేదన్నారు.
పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే ప్రజలే కొడతారని, మహిళలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపిన చరిత్ర పెద్దారెడ్డిది అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలకు పాల్పడిన పెద్దారెడ్డి తాము అధికారంలో ఉన్నంతవరకు తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వబోమని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.