సినిమా
Jatt: ‘జాట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Jatt: బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ ‘జాట్’ సినిమా ఓటీటీలోకి రానుంది! నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుంది. టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందించిన ‘జాట్’ సినిమా బాలీవుడ్లో సూపర్ హిట్ అయింది.
సన్నీ డియోల్ మాస్ యాక్షన్‌తో థియేటర్లలో దుమ్మురేపిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. తాజా బజ్ ప్రకారం, జూన్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘జాట్’ స్ట్రీమింగ్ కానుంది. హిందీలో మాత్రమే అందుబాటులో ఉంటుందని టాక్.
థియేటర్లలో మిస్ అయిన ఆడియెన్స్ ఈ మాస్ ట్రీట్‌ను ఓటీటీలో ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు. మేకర్స్ ఇప్పటికే ‘జాట్’ సీక్వెల్‌ను కూడా అనౌన్స్ చేశారు. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా రిలీజ్ డేట్‌పై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. మరి, ‘జాట్’ ఓటీటీలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.