RRR తరువాత ‘హిట్-3’ సంచలనం..!

Hit-3: న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా ఇప్పుడు ఓ అరుదైన ఫీట్ సాధించబోతోంది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
హిట్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రం ‘హిట్-3’ సాలిడ్ బజ్‌ని క్రియేట్ చేసింది. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని యాక్షన్ అవతార్‌లో మరోసారి అదరగొట్టనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రముఖ యూట్యూబర్ పియర్ల్ మానే నిర్వహిస్తున్న పియర్ల్ మానే షోలో జరగనున్నాయి. ఈ షోలో ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి ‘ఆర్ఆర్ఆర్’ మాత్రమే ప్రమోషన్స్ చేసింది.
ఇప్పుడు ‘హిట్-3’ ఈ అరుదైన గుర్తింపును సొంతం చేసుకోనుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. నాని అభిమానులు ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ధీమాగా ఉన్నారు.