Jani Master: జానీ మాస్టర్‌కు మరో భారీ అవకాశం!

Jani Master: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రంలో జానీ మాస్టర్‌కు కీలక అవకాశం దక్కింది. స్పెషల్ సాంగ్‌కు కొరియోగ్రఫీ అందించనున్న ఆయన, ఈ సినిమాతో మరోసారి సత్తా చాటనున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు స్పెషల్ సాంగ్‌కు కొరియోగ్రఫీ అందించే అవకాశం లభించింది. బుచ్చిబాబు దర్శకత్వంలో జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జానీ మాస్టర్ తనదైన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు.
గతంలో రామ్ చరణ్‌తో ‘రంగస్థలం’, ‘బ్రూస్ లీ’, ‘ఎవడు’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన నృత్య రీతులను అందించిన జానీ, ఈ సాంగ్‌ను కూడా హైలైట్‌గా నిలిపేందుకు శ్రమిస్తున్నారు. ఇటీవల వివాదాలతో వార్తల్లో నిలిచిన జానీకి, ఈ అవకాశం మరో బంగారు ఒడ్డుగా మారనుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.