ఆంధ్ర ప్రదేశ్
విజయవాడలో మ్యాన్‌హోల్‌లో పడి టీడీపీ నేత మృతి

విజయవాడలో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండుప్రాణం బలైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. రాత్రి 53 డివిజన్ గులాబ్ మొహిద్దిన్ స్ట్రీట్‌లో ఇటీవల తవ్విన మ్యాన్‌హోల్‌లో పడి స్థానిక 53 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు టీవీ మధుసూదన్ మృతి చెందారు.
మధుసూధన్ కుటుంబాన్ని మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, మ్యాన్‌హోల్ తవ్వి రక్షణ చర్యలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు.



