Jailer-2: రజనీ బర్త్‌డేకి జైలర్-2 టీజర్?

Jailer-2: సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు డబుల్ ధమాకా సిద్ధమవుతోంది. జైలర్-2 షూటింగ్ వేగంగా పూర్తవుతూనే ఉంది. ఈ చిత్రం టీజర్‌ను డిసెంబర్ 12న రిలీజ్ చేయనున్నారు. అదేరోజు రజనీకాంత్ పుట్టినరోజు కావడం విశేషం.
సూపర్‌స్టార్ రజనీకాంత్ – దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న జైలర్-2పై తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో అపార అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం బ్లాక్‌బస్టర్ సక్సెస్ సాధించడంతో సీక్వెల్ హైప్ ఆకాశాన్నంటింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టీజర్ విడుదలకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 12న టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
ఆ రోజు రజనీకాంత్ 74వ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భంగా సన్ పిక్చర్స్ భారీ ట్రీట్ ఇవ్వాలని ప్లాన్ చేసింది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌తోనే అదిరిపోయే హైప్ సృష్టించిన మేకర్స్ టీజర్‌తో మరింత రచ్చ చేయనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎలాంటి రేంజ్‌లో ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.



