సినిమా
జైలులో చలికి వణికిపోతున్న దర్శన్.. దుప్పటి కోసం వేడుకోలు!

రేణుకాస్వామి హత్య కేసులో జైలులో ఉన్న కన్నడ స్టార్ దర్శన్ చలి తీవ్రతకు ఇబ్బంది పడుతున్నానని కోర్టుకు వాపోయాడు. ఇంటి నుంచి దుప్పటి ఇప్పించాలని కోరగా జడ్జి ఆదేశించారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న దర్శన్‌ను 57వ సీసీహెచ్ కోర్టు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. చలి ఎక్కువగా ఉండటంతో నిద్రపట్టడం లేదని, ఇంటి నుంచి తెచ్చిన దుప్పటి ఇప్పించాలని దర్శన్ కోరాడు.
మరో నిందితుడు నాగరాజు కూడా అదే విజ్ఞప్తి చేశాడు. జడ్జి జైలు అధికారులపై మండిపడ్డారు. ఇప్పటికే ఆదేశించినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించి, అదనపు కంబళ్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేశారు. ఇదిలా ఉంటే జైలులో రాచమర్యాదల వీడియో లీకేజీ కేసులో దర్శన్ భార్య విజయలక్ష్మికి కూడా నోటీసులు జారీ చేయనున్నారు.



