Jagga Reddy: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ప్రధాని మోడీ కన్ను పడింది

Jagga Reddy: ఏపీ రాజకీయాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులను పాలకులు నట్టేట ముంచుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు మారినా స్టీల్ ప్లాంట్ ముందు కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదని జగ్గారెడ్డి అన్నారు.
ప్రధాని మోడీతో మాజీ సీఎం జగన్, ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు మంచి పరిచయాలు ఉన్నాయన్నారు. అయినా సరే స్టీల్ ప్లాంట్ సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదన్నారు.
మోదీ వద్దకు వెళ్లి వీరెవరూ గట్టిగా అడిగే ప్రయత్నం చేయకపోవడం వల్లనే కార్మికులు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారని జగ్గారెడ్డి అన్నారు. గత కొద్ది రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనలు చేస్తున్నా వారిని పట్టించుకోకుండా పాలకులు కేంద్రప్రభుత్వానికి వత్తాసు పలకడమేంటని ప్రశ్నించారు



