తెలంగాణ
మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కష్ట కాలంలో పార్టీతో ఉన్న జీవన్ రెడ్డికి గౌరవం ఇచ్చే విధంగా పార్టీ హైకమాండ్ చొరవ తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డికి ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా పరిస్థితులు అనుకూలించక ఓడిపోయారని అన్నారు.
కాంగ్రెస్ పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పార్టీలోనే ఉన్నాడన్నారు. రాజకీయంగా జీవన్ రెడ్డికి ఎన్నో ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్‌తోనే ఉన్నారన్నారు. కష్ట కాలంలో పార్టీలో ఉన్న జీవన్ రెడ్డికి అవమానం జరగకుండా కాంగ్రెస్ పెద్దలు చొరవ చూపాలన్నారు. జీవన్ రెడ్డికి గౌరవం వచ్చే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జగ్గారెడ్డి కోరారు.



