ఆంధ్ర ప్రదేశ్
Jagan: కష్టాలు ఎల్లకాలం ఉండవు.. ఐదేళ్లు ఓపిక పట్టలేరా?

Jagan: వైసీపీ వీడిన వారిపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో ఎవరికైనా క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలన్నారు. ప్రలోభాలకు లొంగి, భయపడి కాంప్రమైజ్ అయితే గౌరవం ఉంటుందా అని ప్రశ్నించారు. మనంతటే మనమే వ్యక్తిత్వం తగ్గించుకుంటే ఎలా అంటూ క్వశ్చన్ చేశారు జగన్.
కష్టాలు ఎల్లకాలం ఉండవన్న జగన్.. ఐదేళ్లు ఓపిక పట్టలేరా అని అన్నారు. ఇక వెళ్లిపోయే నాయకుల మీద పార్టీ ఆధారపడదని తేల్చిచెప్పిన జగన్.. విజయ సాయిరెడ్డి సహా వెళ్లిపోయిన అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.