తెలంగాణ
Jagadish Reddy: మూటలు అప్పజెప్పేందుకే రేవంత్ ఢిల్లీ పర్యటనలు

Jagadish Reddy: మూటలు అప్పజెప్పేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏటీఎమ్ అయిందని స్వయంగా ప్రధానమంత్రి మోడీయే అన్నారని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. రేవంత్ పాలనలో మోటార్లు కాలిపోతున్నాయని ఎరువులు అందక రైతులు అవస్థలు పడుతున్నారని జగదీష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందిర కాలంలోని ఎమర్జెన్సీ పరిస్థితులే రేవంత్ పాలనలో కనిపిస్తున్నాయని బీఆర్‌ఎస్ నేత ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టు అనుమతుల దశల ఉందో, నిర్మాణంలో ఉందో, పూర్తయిందో తెలువకుండా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మాట్లాడటం కాంగ్రెస్ నాయకుల తెలివికి నిదర్శనం అని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.