Jack: జాక్ నుంచి కిస్ సాంగ్ విడుదల

Jack: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాక్’. ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘కొంచెం క్రాక్’ అనే క్యాచీ ట్యాగ్ లైన్ యాడ్ చేసి మరింత ఆసక్తి పెంచారు.ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి.
తాజాగా ‘జాక్’ నుంచి ‘కిస్ సాంగ్’ విడుదలైంది. హైదరాబాద్ లోనే ఈ లిరికల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. విడుదలైన క్షణాల్లోనే ఈ సాంగ్ ట్రెండింగ్‌లోకి ఎక్కింది. ఇప్పటికే టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ రావడంతో, ఇప్పుడు ‘కిస్ సాంగ్’ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఈ పాటకు సంబంధించిన పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది.
పాట విజువల్స్ పరంగా స్టైలిష్‌గా, కలర్ ఫుల్‌గా కనిపిస్తోంది. పాటలో సిద్ధు యాక్టింగ్ సహజంగా ఉంది. వైష్ణవి చైతన్య లుక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. థియేటర్ బ్యాక్‌డ్రాప్‌లో క్యాప్చర్ చేసిన లొకేషన్స్ కూడా మంచి ఫీల్‌ను అందించాయి. మొత్తానికి, ‘కిస్ సాంగ్’ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. ఇక ఏప్రిల్ 10న రాబోతున్న ‘జాక్’ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.