తెలంగాణ

ఓయూలో జేఏసీ నాయకులు నిరసన… ప్రభుత్వ ఉద్యోగుల పదవి కాలం తగ్గించాలని డిమాండ్

ఓయూ వద్ద జేఏసీ నాయకులు నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ కాలం తగ్గించాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ వయసును 61 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలకు తగ్గించాలని ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ మోతీలాల్ నాయక్ అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 58 నుంచి 61 సంవత్సరాల వరకు పెంచి ఉద్యోగులపై పనిభారం మోపిందన్నారు. ఉద్యోగులపై పని భారం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ వారికి ఉద్యోగులకు పదవి విరమణ వయస్సును 55 సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button