ఓయూ వద్ద జేఏసీ నాయకుల నిరసన
కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ కాలండర్ ప్రకటిస్తానని నిరుద్యోగులను మోసం చేశారని ఓయూ జేఏసీ నేత మోతిలాల్ నాయక్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన లైబ్రరీ వద్ద ఓయూ జేఏసీ నేత మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మోతిలాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి జాబ్ కాలంలో విడుదల చేయాలి లేని పక్షంలో వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి ప్రచారం చేస్తామని డిమాండ్ చేశారు.
గతంలో పెంచిన ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని వెంటనే తగ్గించి ఉద్యోగుల వయోపరిమితి వయసు 58 సంవత్సరాలకు తగ్గించాలి లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ అన్నారు. ఓయూ ప్రధాన లైబ్రరీ వద్ద నిరుద్యోగులు నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలా వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి ప్రచారం చేస్తామని హెచ్చరించారు.