తెలంగాణ
IT Raids: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం.. 15 ప్రాంతాల్లో సోదాలు

IT Raids: హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం చెలరేగింది. నగరంలో పేరు గాంచిన రెస్టారెంట్ చైన్ ఓనర్స్ నివాసాలు కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
పిస్తా హౌస్, మెఫీల్, షా గౌస్ రెంట్స్ లో వందల కోట్ల వ్యాపారం జరుగుతుండగాఇన్ కం టాక్స్ చెల్లింపుల్లో మాత్రం భారీ అవకతవకలు జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఆయా హోటల్స్ యజమానుల నివాసాలు, బంధు మిత్రుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. రాజేంద్ర నగర్ పిస్తా హౌస్ యజమాని నివాసంలోనే నాలుగు బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి.



