తెలంగాణ
Hyderabad: DSR గ్రూప్ కంపెనీలపై ఐటీ సోదాలు

Hyderabad: హైదరాబాద్‌లో ప్రముఖ DSR గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఉదయం నుండి ప్రారంభమైన ఈ సోదాలు కంపెనీకి చెందిన కార్యాలయాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ కొనసాగుతున్నాయి. ఒకేసారి దాదాపు 10 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. DSR గ్రూప్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణరెడ్డి నివాసాలు, కార్యాలయాల్లోనూ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, SR నగర్, సురారం ప్రాంతాలలో ఐటీ డిపార్మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలు కంపెనీ పన్నుల చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఐటీ శాఖకు అనుమానం రావడంతో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనితో కంపెనీకి సంబంధించిన గత ఐదు సంవత్సరాల పన్ను చెల్లింపులపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.



