అంతర్జాతీయం

Israel-Iran War: తారస్థాయికి చేరుకున్న ఇరాన్, ఇజ్రాయిల్ వార్

Israel-Iran War: ఇరాన్, ఇజ్రాయెల్‌ దేశాల మధ్య యుద్ధం తారస్ధాయికి చేరిన తరుణంలో ఈ వార్ సీన్ లోకి రష్యా ఎంట్రీ ఇచ్చింది. అటు ఇరాన్ తో సత్సంబంధాలు నెరపుతూనే… ఇజ్రాయిల్‌‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న రష్యా రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు విఫల యత్నం చేస్తోంది. ఇరాన్ ను తుద ముట్టించేందుకు ఇజ్రాయెల్‌ చేస్తున్న వ్యూహాలకు అమెరికా వంత పాడటంతో పరిస్ధితి ఉద్రిక్తం అవుతోందని రష్యా గ్రహించింది. ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ దెబ్బతినడం వల్ల వాణిజ్య పరంగా దాని ప్రభావం రష్యాపై పడుతోంది. దీంతో ఇరాన్ పై దాడుల్ని ఓ వైపు ఖండిస్తూనే..మరోవైపు ఇజ్రాయిల్‌తో శాంతి చర్చలపై మధ్యవర్తిత్వానికి రష్యా పూనుకోవడం కొసమెరుపు.

కరవ మంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా మారింది ఇరాన్, ఇజ్రాయెల్‌ దేశాల పరిస్ధితి. ఇజ్రాయెల్‌ దాడులతో బీభత్స పరిస్ధితి నెలకోవడంతో ఇరాన్ ఎదురు దాడుల్ని తీవ్రం చేసింది. ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఈ మొత్తం సీన్ ను చూసి, అమెరికా బాగా ఎంజాయ్ చేయడమే కాదు..ఇరాన్ ఇకనైనా మొండి పట్టును వీడి..తాము చెప్పినట్లు నడుచుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పనిలో పనిగా వార్నింగ్ ఇచ్చారు.

ఓ వైపు ఇజ్రాయెల్‌ మరోవైపు అమెరికా ఇలా ముప్పేట దాడిలో చిక్కుకున్న ఇరాన్ ను సేవ్ చేసేందుకు నేనున్నానంటూ రష్యా ముందుకు వచ్చింది. ఇరాన్ తో రష్యాకు వాణిజ్య పరమైన సంబంధాలతో పాటూ రక్షణ పరమైన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్న దాఖలాలు ఉన్నాయి. రష్యాతో ఇరాన్ అణ్వాయుధాల ఒప్పందం కుర్చుకున్న దగ్గర నుంచి ఈ బంధం బల పడింది. ఇలాంటి పరిస్ధితుల్లో ఇజ్రయేల్ దాడులతో అతాలా కుతలమవుతున్న ఇరాన్ ను ఏదో రకంగా బయట పడేయాలన్న తాపత్రయం రష్యాలో కనిపిస్తోంది.

ఇరాన్ తో ఉన్న సంబంధాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా అటు ఇజ్రాయిల్ తో కూడా రష్యా మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తోంది. టెర్రరిస్టుల వ్యతిరేక పోరాటంలో ఇజ్రాయిల్ చేసే పోరాటానికి రష్యా మద్దతు ప్రకటించడంతో ఈ రెండు దేశాల మధ్య మైత్రి ఏర్పడింది. ఇజ్రాయిల్ కు అమెరికా అండ ఉన్నప్పటికీ రష్యాతోనూ సత్సంబంధాలను కొనసాగించడం గమనార్హం.

తనకు మిత్ర దేశాలైన ఇరాన్, ఇజ్రయేల్ దేశాల మధ్య జరిగే యుద్ధాన్ని ఆపాలని రష్యా భావించడానికి మరో కారణం కూడా ఉంది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగే యుద్ధం మొన్నటి వరకు ఫోకస్ అయింది. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్‌ వార్ తో ఈ విషయం డైవర్ట్ అయిపోతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ భావిస్తున్నారట. ఒకేసారి రెండు యుద్ధాలు జరిగితే ప్రపంచ దేశాలు ఇరాన్, ఇజ్రయేల్ వార్ మీదే ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది.

అందువల్ల ముందు తన మిత్ర దేశాల మధ్య వార్ ను ఆపితే..అప్పుడు ఉక్రెయిన్ పై పోకస్ పెట్టి, అమీ తుమీ తేల్చుకోవచ్చన్నది పుతిన్ వ్యూహం. అందుకే ఇరాన్ అధినేత మసౌద్ పెజష్కియన్ తో పాటూ ఇజ్రయేల్ అధిపతి నెతన్యాహుతో ఫోన్ లో మాట్లాడి, రెండు దేశాలు ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేయాలని పుతిన్ సలహా ఇచ్చాడు. వీరిద్దరితో ఆగకుండా ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కూడా ఫోన్ చేసి, ఇదే విషయం చెప్పాడు. అవసరమైతే తాను మధ్య వర్తిత్వం వహించి, యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తానని పుతిన్ ప్రతిపాదించడం హైలైట్ అంశం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button