Trisha: పెళ్లి చేసుకోబోతున్న త్రిష?

Trisha: సీనియర్ నటి త్రిష, నలభై పదుల వయస్సులోనూ స్టార్ హీరోయిన్‌గా తన స్థానాన్ని కాపాడుకుంటోంది. తన ఆకర్షణీయమైన గ్లామర్ మరియు సౌందర్యంతో యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక ఫోటో, ఆమె పెళ్లి గురించిన పుకార్లకు మరింత ఆజ్యం పోసింది.
ఈ ఫొటోలో త్రిష చీర, గజ్రా, ఆభరణాలతో సంప్రదాయ రూపంలో అద్భుతంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో త్రిష వివాహం గురించి చర్చలను రేకెత్తించింది. ఈ ఫొటో ఆమె జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తిని సూచిస్తుందా లేక సినిమా ప్రచారమా అని అభిమానుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో కూడా త్రిష పెళ్లి గురించి వార్తలు వచ్చినప్పటికీ అవి కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి.
అయితే, ఈ సరికొత్త పోస్ట్ మాత్రం ఆ పుకార్లకు బలం చేకూర్చినట్లు కనిపిస్తోంది. ఈ పోస్ట్‌కు లక్షల సంఖ్యలో లైక్‌లు వస్తున్నాయి. అంతేకాకుండా, త్రిష ఈ పోస్ట్ కు “Love always wins” అనే క్యాప్షన్‌తో పాటు గ్రీన్ హార్ట్ ఎమోజీని జోడించడంతో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.
అసలు ఈ పోస్ట్ వెనుక ఉన్న నిజమైన అర్థం ఏమిటనేది తెలుసుకోవాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు. ప్రస్తుతం తమిళం, తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్న త్రిష, ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌లో కూడా నటిస్తోంది. ‘లియో’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, ‘విశ్వంభర’లో చిరంజీవితోనూ, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో అజిత్‌తోనూ నటిస్తూ కెరీర్‌లో దూసుకుపోతుంది. ఇక త్వరలో రాబోయే ఈ చిత్రాలతో ఆమె ఎలాంటి విజయాలను అందుకుంటుందో వేచి చూడాలి.