లవ్ లో కృతి సనన్?

Kriti Sanon: ప్రభాస్ ఆదిపురుష్ ఫేమ్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ రొమాంటిక్ స్వభావం గురించి ఓపెన్ అయింది. విక్కీ కౌశల్ ఆమె రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో సంబంధం గురించి ఆటపట్టించారు. ఈ ముచ్చట గురించి పూర్తి వివరాలు చూద్దాం.
బాలీవుడ్ నటి కృతి సనన్ ఇటీవల విక్కీ కౌశల్‌తో కలిసి కాజోల్, ట్వింకిల్ ఖన్నా నిర్వహించిన ‘టూ మచ్ టాక్’ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ షోలో రిలేషన్‌షిప్ సెగ్మెంట్‌లో కృతి తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాల్సి వచ్చింది. అందరూ ఆమె రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ కబీర్ బాహియాతో సంబంధాన్ని ఒప్పుకుంటుందని ఎదురు చూశారు. కానీ కృతి మళ్లీ దాటవేసింది. అయితే విక్కీ కౌశల్ మాత్రం ఆమె రిలేషన్లో ఉందన్న హింట్ ఇచ్చేశాడు.
ఆమెను ఆమె రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ కబీర్ పేరు తీసి ఆటపట్టిస్తూ ఆసక్తికర సన్నివేశం సృష్టించాడు. అయితే కృతి మాత్రం నవ్వుతూ టాపిక్ మార్చేసింది. తాను చాలా రొమాంటిక్ స్వభావం కలిగిన వ్యక్తినని, ప్రేమ కథలు ఎక్కువగా వింటానని చెప్పింది. దీంతో అభిమానులు ఆమె ప్రేమ వ్యవహారంపై మరింత ఆసక్తి చూపుతున్నారు. మరి కృతి తన రిలేషన్ పై ఎప్పుడు ఓపెన్ అవుతుందో చూడాలి.



