పాకిస్తాన్ తప్పుడు ఉద్దేశాలకు అమెరికా మద్దతు..?

పాకిస్తాన్, అమెరికా మధ్య సంబంధాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. గుంటనక్క లాంటి అమెరికా అధ్యక్షుడి నీచ బుద్ధి బయటపడింది. శత్రుదేశమైన పాకిస్తాన్‌తో లోలోపల సంబంధాలు పెట్టుకుంటూనే బయటకు మాత్రం ఏమీ తెలియని అమాయక చక్రవర్తీలాగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఇప్పుడు యావత్ భారత్ మొత్తం అమెరికా-పాకిస్తాన్ తీరుపై చర్చించుకుంటున్నారు. పాకిస్తాన్ భద్రతా నిపుణుడు ఇంతియాజ్ గుల్ చేసిన వ్యాఖ్యలు వాటికి ఆజ్యం పోశాయి. ఇంతకీ పాక్- అమెరికాకు మధ్య ఉన్న సంబంధాలు ఏంటి..? గుల్ ఏమన్నాడు..?
పాకిస్తాన్ ఒక రోగ్ కంట్రీ. ఉగ్రవాదం మొదలు డర్టీ డ్రగ్స్, ఫేక్ కరెన్సీ వరకూ అది చేయని నాన్సెన్స్ అంటూ ఏదీలేదు. ఈ విషయం తెలుసుకాబట్టే చాలా దేశాలు పాకిస్తాన్‌ను విలన్‌గా ట్రీట్ చేస్తాయి. ఇస్లామాబాద్‌తో దౌత్య సంబంధాలు ఏర్పరుచుకోడానికి ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాయి.
ఇటీవల ఇస్లామిక్ దేశాలు సైతం పాకిస్తాన్‌ను పూర్తిగా పక్కనపెట్టేశాయి. కానీ అమెరికాలో మాత్రం ఎలాంటి మార్పూ రావడం లేదు. పాకిస్తాన్ తప్పుడు ఉద్దేశాలకు అమెరికా మద్దతుగా నిలుస్తోంది. ఇందుకు పాకిస్తాన్ భద్రతా నిపుణుడు ఇంతియాజ్ గుల్ చేసిన వ్యాఖ్యల అందుకు అద్ధం పడుతున్నాయి.
పాకిస్తాన్ భద్రతా నిపుణుడు ఇంతియాజ్ గుల్ రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం గురించి తీసిన సంచలనాత్మక వీడియో ప్రస్తుతం వివాదానికి, చర్చకు దారితీసింది. ఈ వైమానిక స్థావరం అమెరికా నియంత్రణలో ఉందని పాకిస్తాన్ ఆర్మి సీనియర్ అధికారులు కూడా ఇందులో జోక్యం చేసుకోరంటూ గుల్ ఆరోపించారు. ఈ విడియోతో అమెరికా- పాకిస్తాన్ సైనిక సహకారంపై అందరి దృష్టి పడింది. దీంతో సైనిక వ్యవహారాల్లో సార్వభౌమాధికారం, పారదర్శకత గురించిన ఆందోళనలు మొదలైయ్యాయి.
అమెరికా-పాకిస్తాన్ మధ్య అధికారికంగా ఎప్పుడూ బహిర్గం కాని లోతైన కార్యచరణ ఒప్పందాలను గుల్ బయటపెట్టారు. నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ అమెరికా నియంత్రణలో ఉందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కూడా జోక్యం చేసుకోవడానికి అనుమతి లేదని గుల్ అన్నారు. అమెరికన్ విమానాలు తరచుగా ఈ స్థావరంలో కనిపిస్తాయని వాటి కార్యకలాపాలు సరుకు రవాణాకు సంబంధించి పారదర్శకత స్థిరంగా లేదని ఆయన ఆరోపించారు.
ఈ వాదన పాకిస్తాన్ గడ్డపై అమెరికా అనుభవించే రహస్య ఉమ్మడి కార్యకలాపాలు, ప్రత్యేక యాక్సెస్ హక్కులను సూచిస్తుందని తెలిపారు. ఇదే నిజమైతే జాతీయ సార్వభౌమాధికారంపై గణనీయమైన రాజీని సూచిస్తుందని అన్నారు. కాగా నూర్ ఖాన్ వైమానిక స్థావరం పాకిస్తాన్ కు అపారమైన వ్యూహాత్మక విలువను కలిగి ఉంది.
ఇస్లామాబాద్ నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ సైన్య ప్రధాన కార్యాలయం అయిన రావల్పిండికి ఆనుకొని ఉన్న ఈ వైమానిక స్థావరంసైనిక, పౌర కార్యకలాపాలకు కీలకమైనది. ఇది పాకిస్తాన్ అణ్వాయుధ సామగ్రికి బాధ్యత వహించే కమాండ్ అథారిటీ అయిన స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ సమీపంలో కూడా ఉంది.
ఈ స్థావరంలో పాకిస్తాన్ యొక్క ప్రధాన వైమానిక రవాణా స్క్వాడ్రన్లు ఉన్నాయి. వీటిలో C-130 హెర్క్యులస్, IL-78 మిడ్ఎయిర్ రీఫ్యూయలర్లు ఉన్నాయి. ఇవి లాజిస్టిక్స్ , ఎయిర్‌లిఫ్ట్ సామర్థ్యాలకు అవసరం. అదనంగా, ఇది పాకిస్తాన్ యొక్క వైమానిక మొబిలిటీ కార్యకలాపాలకు కమాండ్ హబ్‌గా పనిచేస్తుంది.
ఈ స్థావరం పౌర మౌలిక సదుపాయాలతో కూడా అనుసంధానించబడి ఉంది. దాని ప్రాంగణాన్ని బెనజీర్ భుట్టో అంతర్జాతీయ విమానాశ్రయం, PAF కళాశాల చక్లాలా సైనిక కుటుంబాలకు సేవలందించే విద్యా సంస్థ అయిన ఫజాయా ఇంటర్ కాలేజ్ నూర్ ఖాన్‌లతో పంచుకుంటుంది.
ఈ వివాదానికి తోడు, ఇటీవల భారత వైమానిక దళం నూర్ ఖాన్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని.. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా దాడి చేసింది. ఈ దాడిలో 26 మంది మరణించారు. ఈ ఆపరేషన్ వైమానిక స్థావరానికి భారీ నష్టం కలిగించిందని ప్రాంతీయ భద్రతా డైనమిక్స్‌లో దాని ప్రాముఖ్యతను ఇది హైలైట్ చేసిందని నివేదికలు చెబుతున్నాయి. నూర్ ఖాన్‌పై దాడి చేయాలనే భారతదేశం నిర్ణయం వ్యూహాత్మకమైనది మాత్రమే కాదు లాజిస్టికల్, సైనిక ఆస్తులను దెబ్బతీసే లక్ష్యంతో కూడా.
ఎందుకంటే పాకిస్తాన్ అణు కమాండ్ కేంద్రాలు, సైనిక ప్రధాన కార్యాలయాలకు స్థావరం సమీపంలో ఉంది. అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ, గుల్ వెల్లడి పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలపై అమెరికా ప్రభావం ఎంత అనే దానిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది.
మొత్తానికి అమెరికా- పాకిస్తాన్ మధ్య లోపాయికారి ఒప్పందాలు బయటపడ్డాయి. అమెరికా అవకాశం దొరికనప్పుడల్లా తన స్వలాభం కోసం గుంట నక్కలా కాచుకు చూస్తుందని మరోసారి తేలిపోయింది. దీంతో ఇప్పుడు అమెరికాను సైతం ఎవ్వరూ నమ్మలేని పరిస్థితుల్లో పడిపోతున్నారట. మరీ చూడాలి దీనిపై ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయో..? మోదీ జీ ఎలాంటి మంత్రాంగాన్ని ప్రయోగిస్తారో..?