ఆంధ్ర ప్రదేశ్
కడప సెంట్రల్ జైల్‌లో అక్రమాలు

Kadapa: కడప సెంట్రల్ జైలు కేంద్రంగా జరుగుతున్న అక్రమాలపై రాజమండ్రి సెంట్రల్ జైల్ డీఐజీ స్థాయి అధికారి కిరణ్ విచారణ చేపట్టారు. మూడు రోజులుగా రహస్యంగా ఈ విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఎర్రచందన్ పీడీ యాక్ట్ సెక్షన్ కింద అరెస్ట అయ్యి జైలుకొచ్చిన నిందితుడి వద్ద 10 సెల్ ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు. మరికొన్ని సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
రాజమండ్రి నుంచి వచ్చిన ఖైదీలను కూడా వేరు గదిలోకి పిలిపించి ఇక్కడ జరుగుతున్న వ్యవహరాలపై సమాచారం సేకరిస్తున్నారు. కొంతకాలంగా కడప సెంట్రల్ జైలు జరుగుతున్న వ్యవహారాల్లో అధికారుల ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తం అవుతుంది.