అంతర్జాతీయం

హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ మేఘాలు భారత నావికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముంబైకి చెందిన కెప్టెన్ వీరేంద్ర విశ్వకర్మ, మరో 33 మంది సిబ్బందితో కలిసి మార్చి 2 నుంచి హర్మూజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోయారు. 36 లక్షల గ్యాస్ సిలిండర్లకు సమానమైన భారీ ఎల్‌పీజీ లోడుతో ఉన్న ఈ ట్యాంకర్, ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం యూఏఈలోని మినా సకర్ పోర్టు వద్ద నిలిచిపోయింది.

అక్కడి భయానక పరిస్థితులను కెప్టెన్ వీరేంద్ర స్వయంగా వివరించారు. మేము రోజూ ఆకాశంలో క్షిపణులు, డ్రోన్లు ఎగరడం చూస్తున్నాం. నిరంతరం సైరన్ల మోత వినిపిస్తూనే ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద ప్రస్తుతం 60 రోజులకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని, భారత నౌకాదళం తమకు రక్షణగా వచ్చి సురక్షితంగా స్వదేశానికి తీసుకెళ్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, భారత్‌తో ఉన్న స్నేహ సంబంధాల దృష్ట్యా ఇరాన్ భారత నౌకలకు ‘గ్రీన్ సిగ్నల్’ ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు భారత ఎల్‌పీజీ ట్యాంకర్లను హర్మూజ్ జలసంధిని దాటేందుకు ఇరాన్ అనుమతించినట్లు తెలుస్తోంది. ఇదే రీతిలో కెప్టెన్ వీరేంద్ర ప్రయాణిస్తున్న నౌకకు కూడా భారత నౌకాదళ రక్షణతో త్వరలోనే సురక్షిత మార్గం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button