IPL విలువ రూ.158,000 కోట్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL వ్యాపారంగా దాని విలువ 12.9 శాతం పెరిగి USD 18.5 బిలియన్లకు చేరుకుందని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ హౌలిహాన్ లోకే నివేదిక తెలిపింది. గత సంవత్సరంలో IPL యొక్క స్టాండ్-అలోన్ బ్రాండ్ విలువ 13.8% పెరిగి USD 3.9 బిలియన్లకు చేరుకుందని నివేదిక పేర్కొంది. IPL పెరుగుతున్న ఆకర్షణను కూడా ఈ నివేదిక వివరించింది. BCCI నాలుగు అసోసియేట్ స్పాన్సర్ స్లాట్‌లను – My11Circle, Angel One, RuPay మరియు CEAT – విక్రయించడం ద్వారా 1,485 కోట్లు ఆర్జించాయని, ఇది మునుపటి చక్రం కంటే 25శాతం ఎక్కువని ఎత్తి చూపింది.
మరోవైపు, ఈ టోర్నమెంట్ టాటా గ్రూప్‌తో తన టైటిల్-స్పాన్సర్‌షిప్ నిబద్ధతను 2028 వరకు USD 300 మిలియన్ సుమారు 2వేల 500 కోట్ల విలువైన ఐదేళ్ల ఒప్పందంలో పొడిగించింది. IPL ఫ్రాంచైజీల విషయానికొస్తే, 2025 ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB USD 269 మిలియన్ల బ్రాండ్ విలువతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గత సంవత్సరం USD 227 మిలియన్ల నుండి ఇది పెరిగింది. రెండో స్థానంలో, ముంబై ఇండియన్స్ 2024లో USD 204 మిలియన్ల నుండి ఈ సంవత్సరం USD 242 మిలియన్లకు పెరిగింది.
అయితే, చెన్నై సూపర్ కింగ్స్ CSK USD 235 మిలియన్ల బ్రాండ్ విలువతో మూడో స్థానానికి పడిపోయింది. నివేదిక ప్రకారం, పంజాబ్ కింగ్స్ PBKS 2024 కంటే బ్రాండ్ విలువలో 39.6 శాతం పెరుగుదలను నమోదు చేస్తూ, సంవత్సరానికి అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. వీక్షకుల సంఖ్య విషయానికి వస్తే, IPL 2025 ఫైనల్‌కు జియో హాట్‌స్టార్‌లో 67.8 కోట్లకు పైగా వీక్షణలు నమోదయ్యాయి – ఇది 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారతదేశం-పాకిస్తాన్ ఘర్షణ కంటే ఎక్కువ.
IPL క్రీడా వ్యాపారంలో ప్రమాణాలను నెలకొల్పుతూనే ఉంది. ఫ్రాంచైజీ విలువలు పెరిగాయి.మీడియా హక్కుల ఒప్పందాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బ్రాండ్ భాగస్వామ్యాలు రంగాలలో వైవిధ్యభరితంగా మారాయని హౌలిహాన్ లోకేలో ఆర్థిక వాల్యుయేషన్ అడ్వైజరీ డైరెక్టర్ హర్ష్ తాలికోటి వ్యాఖ్యానించారు.