IPL Betting: ఐపీఎల్ హోరు.. బెట్టింగ్ జోరు

IPL Betting: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ వచ్చిందంటే అభిమానుల సంగతి పక్కన పెడితే బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగ్ మాఫియాలు మాత్రం చెలరేగిపోతుంటాయి. మ్యాచ్ మ్యాచ్ కు కాదు బాల్ బాల్ కి పందెం కట్టి ఓపెన్ గానే వేల కోట్లు వ్యాపారం చేస్తున్నారు. పందెం నడిపేవారు పందెం కాసేవారు ఎవరు ఒకరి ఒకరు చూసుకునేది లేదు. చేతికి డబ్బులు ఇచ్చేది లేదు. అంతా ఆన్లైన్ లోనే సులభంగా డబ్బులు సంపాదించినందుకు ఎక్కువ మంది యువత ఈ బెట్టింగ్ ఆకర్షితులవుతున్నారు. ముందు ఒకటి రెండుసార్లు అంటూ మొదలై ఆ తర్వాత దానికి బానిసలు అవుతున్నారు.
సంపాదించే సంగతి ఎలా ఉన్న బెట్టింగ్ మాయలో పడి దాచుకున్న డబ్బులే కాదు అందిన చోట్ల అంతా అప్పులు చేసి నిండా మునిగిపోతున్నారు. ఉన్నదంతా పోయి రోడ్డున పడే వాళ్ళు కొందరైతే ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు మరికొందరు. ఏటా ఇలాంటి వార్తలు కళ్ళముందే కనబడుతున్నప్పటికీ మళ్లీ మళ్లీ ఎంతోమంది కూపంలో కూరుకుపోతూనే ఉన్నారు యువత ఐపీఎల్ కొత్త సీజన్ శుక్రవారం నుంచి మొదలైంది సుమారు రెండు నెలలు సాగే ఈ టోర్నమెంట్ బెట్టింగ్ బంగార్రాజులకు కాసుల పంట..
నెల్లూరు జిల్లాకు క్రికెట్ బెట్టింగ్ లకు పెద్ద అవినాభా సంబంధమే ఉంది. PHD రాధాకృష్ణ జిల్లా ఎస్పీగా పని చేస్తున్న రోజుల్లో బెట్టింగ్ రాయుళ్ల తుప్పు వదలగొట్టారు. యావత్ రాష్ట్రం ఉలిక్కిపడేలా పద్దుల సంఖ్యలో బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. జిల్లాలోనే కాక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంబంధం ఉన్న అనేక మందిని తీగలాగితే డొంక కదిలిన చందాన నాడు పోలీస్ పని చేసింది. నాటి పోలీసుల పనితీరుకు యావత్ సమాజం శభాష్ పోలీస్ అంటూ సెల్యూట్ చేసింది.
నేడు మారిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ ఊహించుకుంటేనే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి రాబోయే రెండు నెలల కాలంలో ఎన్ని వందల వేల కుటుంబాలు రోడ్డున పడతాయో ఎంతమంది బలవన్మరణానికి పాల్పడతారో బెట్టింగ్ బాంబ్ ఎంత మందిని బలి తీసుకోబోతుందో ఊహ కందని చర్యగానే భావించాలి గతంలో హోటల్ రూమ్లను నిర్మానుష ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యాపారం నేడు సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కడంతో యాప్ ల మాయాజాలం చేతిలోనే క్రికెట్ బెట్టింగ్ ప్రపంచాన్ని ఫోను రూపంలో అత్యంత సులువుగా వాకిట్లోకి తెచ్చేసింది.
పోలీస్ వ్యవస్థ ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప ఆధ్యాత్మిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చుకుని ప్రణాళికలు రూపొందించుకొని నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తే తప్ప యాప్ ల రూపంలో ఉన్న క్రికెట్ బెట్టింగ్ ను నియంత్రించడం అంత సులభమైన పని కాదు. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి నేడు పల్లెటూర్లను కాటేసి దండంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
నాడు రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలిచిన నెల్లూరు పోలీస్ నేడు మరోసారి కన్ను తెరిచి బెట్టింగ్ పై ఉక్కు పాదం మోపాలని నెల్లూరు సమాజం కోరుకుంటుంది. పోలీసుల నియంత్రణ పావలావంతైతే తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల పాత్ర పెద్దదని చెప్పాలి. క్షణక్షణం పిల్లలపై కదలికలపై దృష్టి సారిస్తూ అబ్జర్వేషన్ చేయాల్సిన సమయం ఇది జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకుల పట్టిన చందమే అవుతుంది. పోలీస్ కంటే కూడా పేరెంట్ పాత్ర కీలకమని మరువద్దు.
ఐపీఎల్ క్రికెట్ సందడి మాటున జరిగే కోట్లాది రూపాయల బెట్టింగ్ మాఫియా పై నాటి నెల్లూరు పోలీసుల నీటి నెల్లూరు పోలీస్ కూడా శభాష్ అనిపించుకుంటుందా లెట్స్ వెయిట్ అండ్ సీ.