మస్తాన్ సాయిని కస్టడీకి కోరిన పోలీసులు

Mastan Sai Case: మస్తాన్ సాయి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. దర్యాప్తులో భాగంగా మస్తాన్ సాయిని వారంరోజుల కస్టడీకి కోరారు. అలాగే ఆయన స్నేహితుడు ఖాజాను అరెస్ట్ చేసిన పోలీసులు.. 41 నోటీసులు జారీ చేశారు. అటు నగ్న వీడియోల కేసులోనూ దర్యాప్తు వేగం పెంచారు.
అలాగే బయటపడిన డ్రగ్ పార్టీ వీడియోలపైనా ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే వీడియోల్లో ఉన్నవారికి త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన వీడియోల హార్డ్ డిస్క్‌ను పోలీసులకు అందజేసింది లావణ్య.
అటు హార్డ్ డిస్క్‌ను టెస్టుల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్‌కి పంపారు పోలీసులు. అయితే.. హార్డ్ డిస్క్‌లో వందలాడి న్యూడ్‌కాల్స్, వీడియోస్‌ను గుర్తించారు పోలీసులు. అదేవిధంగా మస్తాన్ సాయి మొబైల్‌లో వేలాదిమంది అమ్మాయిల కాంటాక్ట్ లిస్ట్ ఉన్నట్లు కూడా గుర్తించారు. అమ్మాయిలను ట్రాప్ చేసి వారికి మస్తాన్ సాయి డ్రగ్స్ అలవాటు చేసినట్లు పోలీసుల ఓ నిర్ధారణ కు వచ్చారు.
అంతేకాదు.. మత్తులో ఉన్న అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడినట్లు తేల్చారు. ఇక డ్రగ్స్ టెస్ట్‌లోనూ మస్తాన్ సాయికి పాజిటివ్ రిపోర్ట్ రాగా, డ్రగ్స్ ఎక్కడి నుంచి కొను గోలు చేస్తున్నారని పోలీసులు ఆరా తీస్తున్నారు. అటు మస్తాన్ సాయి మొబైల్‌ను పోలీసులు సీజ్ చేశారు.