Shiva Lingam: రోజురోజుకు పెరుగుతున్న శివలింగం

Shiva Lingam: పరమేశ్వరుడు, ప్రళయకాల రుద్రుడు, శివయ్య, భోళా శంకరుడు, అర్ధనారీశ్వరుడు ఇలా కోరిన వెంటనే వరాలిచ్చే ఆ ముక్కింటికి ఎన్నో పేర్లు. ఏ పేరుతో పిలిచినా పలికే దైవం. మనసావాచా తనను స్మరిస్తే, శరణువేడింది రాక్షసుడైనా సరే వరాలిచ్చేస్తాడు. అందుకే శివాలయాలు నిత్యం శివనామ స్మరణతో మార్మోమోగుతాయి.
ఈ ఆలయాలు కేవలం భారతదేశంలోనే మాత్రమే కాదు. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా భారత్ శత్రుదేశమైన పాకిస్తాన్‌లో అనేక శివలింగాలు ఉన్నాయి. పాకిస్తాన్‌లో శివుని మహిళలు చూసి షరీఫ్ సర్కార్ వెన్నులో వణుకుపుడుతోందట.
మన దేశంలో మహాశివుణ్ణి ఆరాధించేవారు కోట్లలో ఉంటారు. శివున్నీ హిందువులు పరమశివుడు, ప్రళయకాల రుద్రుడు, శివయ్య, భోళా శంకరుడు, అర్ధనారీశ్వరుడు, ముక్కింటి వంటి ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఇక ఆయన లీలలకైతే లెక్కేలేదు. ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు రాజు పేద అనే బేధం లేకుండా ఏ పేరుతో అయినా మనసావాచా తనను స్మరిస్తే రాక్షసుడైనా సరే వరాలివ్వడానికి పరుగెత్తుకుంటూ వస్తాడు ఆ పరమేశ్వరుడు. అందుకే శివాలయాలు అన్నీ ఏడాది పొడుగునా నిత్యం శివనామ స్మరణతో స్మరణతో మార్మోమోగుతాయి.
శివునికి సంబంధించిన అనేక పురాతన ఆలయాలు భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. లయకారుడిని వివిధ రూపాలతో నామాలతో భక్తులు పూజిస్తారు. అలాంటి పురాతన దేవాలయం పాకిస్థాన్‌లో కూడా ఉంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ లో శివుడు శివతాండవం చేస్తున్నాడట. పాకిస్తాన్‌లో ఉన్న ఓ శివాలయాన్ని కూల్చి అక్కడ ఒక మాంసం దుకాణం పెడదామని అక్కడి ముస్లింలు చూశారు.
దాన్ని అక్కడ ఉన్న హిందూవులు కూడా అడ్డుకోలేకపోయారు. ఎందుకంటే అక్కడ హిందూవుల సంఖ్య తక్కువ. ఇలాంటివి హిందూదేవాలయ మీద తరుచూ దాడులు జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఓ దేవాలయాన్ని కూల్చి అక్కడ మాంసం మార్కెట్ నిర్మించడానికి ఓ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రహారి గోడ కూల్చారు. మెయిన్ గుడి దగ్గరుకు వెళ్లి పైన గుడి శికరాన్ని కూల్చుతున్నప్పుడు ఆ జేసీబీ పాడైపోయింది.
ఒక జేసీబీ పాడైపోతే మరొకటి తీసుకొచ్చి మళ్లీ కూల్చడానికి చూశారు. అది కూడా కరాబ్ అయింది. ఇక సరే రేపు జేసీబీలతో కాకుండా క్రేన్ తీసుకొచ్చి కూల్చడానికి ప్రయత్నించారు. ఇంతలో బిల్డర్ కు ఓ కాల్ వచ్చింది. తన కొడుకు ఆరోగ్యం బాగా లేదని హాస్పిటల్ లో ఉన్నారని వెంటనే పని నిలిపివేసి బిల్డర్ వెళ్లిపోయాడు అయితే ఆ ముస్లిం అయిన బిల్డర్ కలలోకి శివుడు వచ్చి “నువ్వు నా గుడిని కూల్చావు అందుకే నీ కొడుకుకు ఆరోగ్యం బాగాలేదని మళ్లీ గుడిని నిర్మిస్తే మీ కోడుకు ఆరోగ్యం బాగుపడుతుందని ఆ శివుడు చెప్పారట దీంతో ఆ ముస్లిం వ్యక్తి తన సొంత డబ్బులతో గుడిని తిరిగి కట్టించారు.
తర్వాత అతని కొడుకు ఆరోగ్యం బాగు పడి తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి అక్కడ పూజలు చేయడం మొదలు పెట్టాడు ఆ వ్యక్తి. అతనిని చూసి చాలా ముంది ముస్లింలు కూడా అక్కడికి వచ్చిన పూజలు చేసేవారు. ఇది పాకిస్తాన్ కరాచీలో జరిగింది.
ఇక… పాకిస్తాన్‌లోని సుమారు 5000 సంవత్సరాల పురాతన కటాసరాజ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయం మహాభారత కాలం నాటిదని చెబుతారు. ఇది పాకిస్థాన్‌లోని చక్వాల్ జిల్లాకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సముదాయంలో నిర్మించబడిన మరో ఏడు దేవుళ్ళ, దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో శివుడు ప్రధాన దైవం అయితే పాండవులు వనవాసం గడిపింది కూడా ఇక్కడే.
కటాసరాజ ఆలయం అనేక దేవాలయాలు స్మారక చిహ్నాలతో కూడిన భారీ సముదాయం. ప్రధాన ఆలయం శివునికి అంకితం చేయబడింది. గర్భాలయంలో శివలింగం ఉంది. ఈ సముదాయంలోని ఇతర ఆలయాలు విష్ణువు, గణేశుడు, దుర్గాదేవికి అంకితం చేయబడ్డాయి. కటాసరాజ ఆలయం హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ప్రతి సంవత్సరం వేలాది మంది హిందూ భక్తులు ఇక్కడికి దర్శనం కోసం వస్తుంటారు.
పురాణ కథల ప్రకారం సతీదేవి తండ్రి దక్షుడు నిర్వహించిన యజ్ఞ గుండంలో పడి ప్రాయోప్రవేశం చేయడంతో శివుడు విచారంగా ఉన్నాడు. అప్పుడు శివుడి కంట నుంచి వచ్చిన కన్నీళ్లు ఒక పెద్ద చెరువుగా మారేంతగా కలత చెందాడు. శివుడి కన్నీటితో ఏర్పడిన పెద్ద చెరువు చుట్టూ కటాసరాజ ఆలయం నిర్మించబడింది.
పురాణాల ప్రకారం శివుడు తన భార్య సతీతో ఇక్కడ నివసించాడు. దక్ష యజ్ఞంలో సతీదేవి ప్రాయోప్రవేశం చేసి మరణించడంతో శివుడు కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. అతను చాలా ఏడ్చాడు.. అలా శివుడి కంట నుంచి పడిన కన్నీళ్ల నుండి ఒక చెరువు ఏర్పడింది. శివుని కన్నీరు కారణంగా ఈ ఆలయానికి కటాస్ అని పేరు వచ్చింది.
మహాభారత కాలంలో పాండవ సోదరులు జూదంలో సర్వం కోల్పోయి 12 సంవత్సరాల వనవాసంలో ఇక్కడ నివసించారు. పాండవులు అరణ్యాలలో సంచరిస్తున్నప్పుడు దాహం వేయగా, వారిలో ఒకరు నీరు కోసం కటాస్ కుండం వద్దకు వచ్చారని దీనికి సంబంధించిన ఒక కథనం ప్రచారంలో ఉంది. అప్పట్లో ఈ చెరువు యక్షుని ఆధీనంలో ఉండేది. తన ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాతే కుండంలోని నీరు తీసుకోమని నీటిని సేకరించేందుకు వచ్చిన పాండవులను కోరాడు.
యక్షుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీటి కోసం వచ్చిన నకుల, సహదేవ, అర్జున, భీముడు కుండం వద్ద సృహ కోల్పోయారు. అప్పుడు కుండం వద్దకు వచ్చిన ధర్మరాజు యక్షుడు అడిగిన ప్రశ్నలకు తన తెలివితేటలను ఉపయోగించి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాడు. యక్షులు యుధిష్ఠిరుడు జ్ఞానానికి ఎంతగానో సంతోషించి పాండవులను స్పృహలోకి తీసుకువచ్చి కుండంలోని నీరు త్రాగడానికి అనుమతించారు.
అలాగే.. పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రం ఉమర్‌కోట్‌లోని శివమందిరం నిత్యం శంభోశంకర స్మరణతో మార్మోగుతుంటుంది. దేశవిభజనకు ముందు అవిభక్త భారత్‌లోని సింధ్‌రాష్ట్రంతో పాటు ప్రస్తుతం పాక్‌గా పేర్కొంటున్న ప్రాంతంలో లక్షలాదిమంది హిందువులు ఉండేవారు. దేశ విభజన అనంతరం మెజార్టీ హిందువులు భారత్‌కు వచ్చేశారు. అయితే కొందరు మాత్రం అక్కడే ఉంటూ పాక్ సమాజంలో భాగమయ్యారు. ఇప్పటికీ పాక్‌లో వేలాది హిందూ దేవాలయాలు, గురుద్వారాలు ఉన్నాయి.
వాటిలో కొన్ని మాత్రమే భక్తులతో అలరారుతుండగా వేలాది కట్టడాలు కనీస సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. సింధ్‌లోని ఉమర్‌కోట్‌గా పిలిచే ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్‌కోట్ అనేవారు. ముస్లిం పాలకుల కాలంలో ఉమర్‌కోట్‌గా మారింది. మొగల్‌పాలకుడు అక్బర్ అమర్‌కోట్‌లోనే జన్మించాడు.
క్షేత్ర పురాణాల ప్రకారం ఇక్కడ పెద్ద పెద్ద పచ్చిక మైదానాలు ఉండేవి. కొందరు పశువుల కాపరులు తమ పశువులను ఇక్కడకు మేతకు తీసుకువచ్చేవారు. కొన్ని ఆవులు ఒక ప్రాంతానికి వెళ్లి పాలిస్తుండేవి. దీంతో ఒక ఆసక్తితో ఆవుల కాపరి ఒకరు అక్కడకు వెళ్లి పరిశీలించగా అది శివలింగమని తేలింది. దీంతో స్థానికులకు తెలపగా వారు పూజలు ప్రారంభించారు. ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.
శివలింగం ఇప్పటికీ పెరుగుతుండటం విశేషం. మహాశివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రానికి లక్షలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. శంభో శంకర నామస్మరణతో ప్రతిధ్వనిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా పెద్దది. భక్తులకు తగినట్టుగా సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
పాక్‌లోని ఏ నగరానికి లేని విశిష్టత ఉమర్‌కోట్‌కు ఉంది. ఈ నగర జనాభాలో దాదాపు 80 శాతం వరకు హిందువులే కావడం గమనార్హం. మతపరమైన వైషమ్యాలు లేవని స్థానికులు చెబుతుంటారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు శివమందిరం ప్రధాన కేంద్రంగా ఉండటం విశేషం.
ఇప్పటికీ పెరుగుతూనే ఉండే శివలింగం పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రం ఉమర్‌కోట్‌లో ఉంది. ఇక్కడి శివమందిరం నిత్యం శంభోశంకర స్మరణతో మార్మోగుతుంటుంది. దేశ విభజనకు ముందు అవిభక్త భారత్‌లోని సింధ్‌రాష్ట్రంతో పాటు ప్రస్తుతం పాక్‌గా పేర్కొంటున్న ప్రాంతంలో లక్షలాదిమంది హిందువులు ఉండేవారు. దేశ విభజన అనంతరం ఎక్కువ శాతం మంది హిందువులు భారత్‌కు వచ్చేశారు.
] అయితే కొందరు మాత్రం అక్కడే ఉంటూ పాక్ సమాజంలో భాగమయ్యారు. ఇప్పటికీ పాక్‌లో వేలాది హిందూ ఆలయాలు, గురుద్వారాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే భక్తులతో అలరారుతుండగా, వేలాది కట్టడాలు కనీస సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. సింధ్‌లోని ఉమర్‌కోట్‌గా పిలిచే ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్‌కోట్ అనేవారు. ముస్లిం పాలకుల కాలంలో ఉమర్‌కోట్‌గా మారింది.
ఆలయ పురాణాల ప్రకారం ఇక్కడ పెద్ద పెద్ద పచ్చిక బయళ్లు ఉండేవి. పశువులు కాసే కొందరు తమ పశువులను మేతకు ఇక్కడకు తీసుకువచ్చేవారు. అందులో కొన్ని ఆవులు ఒక ప్రాంతానికి వెళ్లి పాలిస్తుండేవి. ఆవులు ఎక్కడికి వెళ్లి పాలు ఇస్తున్నాయన్నా ఆసక్తితో ఆవుల కాపరి ఒకరు అక్కడకు వెళ్లి పరిశీలించగా అది శివలింగమని తేలింది. దీంతో స్థానికులకు తెలపగా వారు ఆ లింగానికి పూజలు ప్రారంభించారు. అలా భక్తులతో పూజలు అందుకుంటున్న శివలింగం ఇప్పటికీ పెరుగుతుండటం విశేషం.
ఇలాంటి శివాలయాలు పాకిస్తాన్ లో చాలానే ఉన్నాయి. పాక్ లో హిందూవులపై, శివాలయాలపై దాడులు చేసినప్పుడల్లా ఇలాంటివి జరుగుతుంటాయని అక్కడి స్థానికులు చెబుతున్న మాట.. ఇవన్నీ తెలిసి హిందూ ఆలయాల జోలికి వెళ్లేందుకు షరీఫ్ సర్కార్ వణికిపోతుందని విశ్లేషకులు అంటున్నారు.