తెలంగాణ
Uttam Kumar Reddy: ఆపరేషన్ సిందూర్ దేశం గర్వించదగ్గ విషయం

Uttam Kumar Reddy: సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పాకిస్తాన్ పై జరుగుతున్న భారత సైన్యం పోరాటాన్ని అభినందించారు మంత్రి ఉత్తమ్. పాకిస్తాన్ 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విజయవంతంగా దాడులు నిర్వహించిందన్నారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకు హతమార్చి భారత లక్ష్యాన్ని నెరవేర్చిందన్నారు.
ఆపరేషన్ సిందూర్ లో చాకచక్యంగా సమర్థవంతంగా దేశం గర్వించదగ్గ విధంగా సైన్యం విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. మాజీ సైనికుడిగా, భారత దేశ పౌరుడిగా భారత సైన్యానికి దేశ ప్రజల పక్షాన సెల్యూట్ చేస్తున్నానని ఉత్తమ్ అన్నారు.