తెలంగాణ

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

కరీంనగర్‌లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగతోపాటు, దొంగిలించిన సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న కమ్మరపల్లిలో నివాసముంటున్న టేకు చిరంజీవిని అదుపులోకి తీసుకున్నారు.

అతని నుంచి భారీ మొత్తంలో దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. హార్వెస్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పగలు తాళం వేసిన ఇళ్లను గుర్తించి, రాత్రుళ్లు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button